News December 28, 2025

మీకోసం కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రావడంతో పాటు Meekosam.ap.gov.in ద్వారా లేదా 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

సాయిద సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

సాయుధ పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు నిజాయితీని కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా పోలీసు సాయుధ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కిట్లను, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 31, 2025

HYD: వినూత్నంగా సజ్జనార్ న్యూ ఇయర్ విషెస్

image

న్యూ ఇయర్ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే మద్యం బాబులకు హితవు పలికారు. పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్లో 35 దాటితే బుక్కయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఒక ఏడాదే వృథా అవుతుంది కానీ డ్రైవింగ్‌లో తేడా కొడితే జీవితమే ఆగం అవుతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా, జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.

News December 31, 2025

NRPT: వీధి కుక్కల బీభత్సం.. చిన్నారిపై దాడి

image

ఊట్కూర్‌లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. గాంధీనగర్ వీధికి చెందిన ఓ పసిపాపపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బుడ్లపోల రాజు కుమార్తె అక్షిత చిన్నారి వారి ఇంటి పరిసరాలలో ఆడుకుంటుంది. ఆ సమయంలో 2 వీధి కుక్కలు అక్కడకు చేరుకొని అక్షితపై దాడికి పాల్పడ్డాయి. దీంతో చిన్నారి ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కలను తరిమి చిన్నారిని MBNR ఆసుపత్రికి తరలించారు.