News December 14, 2025

మీకోసం కాల్ సెంటర్ వినియోగించుకోవాలి: కలెక్టర్

image

నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.

Similar News

News December 15, 2025

KNR: ప్రచారం ముగిసింది.. ఓటింగ్ కోసం వెయిటింగ్

image

మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఉమ్మడి KNR జిల్లాలో 408 స్థానాలకు గాను 20 ఏకగ్రీవం కాగా 388 GP ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా KNR-110, జగిత్యాల-113, రాజన్న సిరిసిల్ల-80, పెద్దపల్లి జిల్లాల్లో 85 స్థానాల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభమై ఒంటి గంటకు ముగుస్తుంది. మ.2 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

News December 15, 2025

అనకాపల్లి: జిల్లా పోలీస్ కార్యాలయానికి 50 ఫిర్యాదులు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కారి వేదిక కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ తగాదాలు-34, కుటుంబ కలహాలు-2, మోసపూరిత వ్యవహారాలు-3, ఇతర విభాగాలకు చెందినవి-11 ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీటిపై విచారణ నిర్వహించి వారం రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News December 15, 2025

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

image

విమాన ప్రయాణ ఛార్జీలను ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘టారిఫ్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తాం. విమాన టికెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రయాణికులు గమనిస్తే వాటి స్క్రీన్ షాట్లను మాకు పంపించొచ్చు’ అని వివరించారు. డొమెస్టిక్ మార్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ రూట్ల ఛార్జీలనూ మానిటర్ చేస్తామని పార్లమెంటులో ప్రకటించారు.