News November 16, 2025

మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో నవంబర్ 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.

Similar News

News November 16, 2025

TG న్యూస్ రౌండప్

image

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు

News November 16, 2025

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: MLA బుయ్యని

image

బషీరాబాద్ మండలం కాశీంపూర్, ధామర్‌చేడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలించాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, బస్తాల సరఫరా, రవాణా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని ఆయన స్వయంగా పరిశీలించారు.

News November 16, 2025

NRPT: గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు: ఎస్పీ

image

తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని మోసగాళ్లు చెప్పే గొలుసుకట్టు (Multi-Level Marketing) వ్యాపారాల జోలికి ప్రజలు వెళ్లవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ఈ వ్యాపారాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజలు మాయ మాటలు నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా నమ్మకూడదని తెలిపారు.