News December 29, 2025
మీకోసం వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చు: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు Meekosam.ap.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను నం.1100 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
Similar News
News February 17, 2026
సిరిసిల్ల: ‘పెద్దపులి’ పంజా.. లేగదూడ మృతి

ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పొలం వద్ద కట్టేసిన మూడు లేగదూడలపై అర్ధరాత్రి సమయంలో పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. ఈ దాడిలో రైతు సుధాకర్‌కు చెందిన లేగదూడ మృతి చెందింది. వారం రోజులుగా మండలంలో పులి సంచరిస్తుండటంతో పొలాల వద్దకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
News February 17, 2026
విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 17, 2026
నటి ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

నటి ప్రత్యూష మృతి <<19162866>>కేసులో<<>> సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. పోస్టుమార్టం అన్‌ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


