News December 1, 2025

మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

image

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.

Similar News

News April 14, 2026

PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

image

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్‌‌‌నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.

News April 14, 2026

‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ

image

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ‘ నారీ శక్తి వందన్ అధినయం’ బిల్లుకు మద్దతివ్వాలని CM చంద్రబాబు YCP, JSP చీఫ్‌లు జగన్, పవన్ కళ్యాణ్ సహా అన్ని పార్టీల అధినేతలకు, MPలకు లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్న PM మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో, పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని CBN అభిప్రాయపడ్డారు.

News April 14, 2026

జగిత్యాల సభ: ఉత్తర తెలంగాణపై KCR వ్యూహం!

image

TG: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభను KCR ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే BRSలో చేరనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో BRS పట్టు కోల్పోగా INC, BJP పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో సభలో GOVT వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచేందుకు KCR అడుగులు వేస్తున్నారు.