News November 10, 2025

మీరు ఈరోజు జైనథ్ వెళ్తున్నారా..?

image

జైనథ్‌లో నల్లరాతితో నిర్మితమైన లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం ఆకట్టుకుంటోంది. శిలాశాసనాలు, అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైన ఈఆలయం 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ఆలయ గోడలపై చెక్కిన 20 శ్లోకాలు, జైన సంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలు చరిత్రప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. నేడు ఇక్కడ స్వామివారి రథోత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మీరు వెళ్తున్నారా?

Similar News

News November 10, 2025

ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

image

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్‌ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.

News November 10, 2025

అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 10, 2025

GNT: క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. భార్య చంపిన భర్త.!

image

రియల్ ఎస్టేట్ వ్యాపారి.. క్రికెట్ బ్యాటుతో కొట్టి తన భార్యను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా వాసులైన సి.బ్రహ్మయ్య-కృష్ణవేణి దంపతులు అమీన్‌పూర్‌లోని కేఎస్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇరువురు దంపతులకు ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉండగా..భార్యతో గొడవ పడిన బ్రహ్మయ్య బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది.