News January 13, 2026

‘మీరు చనిపోయారా?’

image

ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. చైనాలో ‘Are you dead’ అనే యాప్ ఇప్పుడు ట్రెండింగ్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్లు 2 రోజులకోసారి అందులోని బటన్ క్లిక్ చేయాలి. యూజర్ బతికే ఉన్నారనడానికి అదే గుర్తు. అలా చేయకపోతే యూజర్ ప్రమాదంలో ఉన్నారని ఎమర్జెన్సీ కాంటాక్టులకు మెసేజ్ వెళ్తుంది. ఒంటరి యువత ఎక్కువగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటోందట. చైనాలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా ఇది నిలిచింది.

Similar News

News March 11, 2026

కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

image

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News March 11, 2026

60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

image

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.

News March 11, 2026

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.