News January 16, 2026

మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

image

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్‌ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.

Similar News

News February 20, 2026

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

image

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల వీటి తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరి, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

News February 20, 2026

అరుదైన విరాళం: వాటర్ పైపుల కోసం 21కిలోల బంగారం!

image

జపాన్‌లోని ఒసాకా నగరాభివృద్ధి కోసం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. సుమారు ₹30 కోట్ల విలువైన ఈ గోల్డ్‌ను నగరంలోని పాతబడిన వాటర్ సిస్టమ్‌ను బాగు చేసేందుకు ఉపయోగించాలని కోరారు. 40ఏళ్ల నాటి డ్రైనేజీ, తాగునీటి పైపుల వల్ల వస్తున్న లీకేజీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ విరాళం అందజేశారు. గతంలోనూ సదరు వ్యక్తి ₹3 లక్షలు డొనేషన్ ఇచ్చినట్లు మేయర్ యొకోహామా వెల్లడించారు.

News February 20, 2026

ఇన్‌స్టాలో ఫొటో చూసి.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు

image

TG: గృహహింస కేసు, బాధతో తల్లి మరణం, లుకౌట్ నోటీస్, మరో వివాహం చేసుకుందన్న కోపంతో గర్భిణి అయిన మాజీ భార్యను కడతేర్చాడా కర్కోటకుడు. మహేశ్-సునీత 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అతడు కెనడా వెళ్లగా గొడవలై భర్త, అత్తమామలపై ఆమె గృహహింస కేసు పెట్టారు. ఇన్‌స్టాలో ఫొటో చూసి మరొకరిని పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాడు. మరో ఫొటోతో HYD వనస్థలిపురంలోని ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చి కిరాతకంగా హత్య చేశాడు.