News December 10, 2025
మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.
Similar News
News December 12, 2025
పెద్దపల్లి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

పెద్దపల్లి(D)లో 5 మండలాల్లోని 99 పంచాయతీల్లో గురువారం మొదటివిడత ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 82.24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. కాల్వశ్రీరాంపూర్ 83.06, ముత్తారం 82.75, రామగిరి 77.96, కమాన్‌పూర్ 83.59, మంథనిలో 84.39 పోలింగ్ నమోదైంది.
News December 12, 2025
రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.
News December 12, 2025
అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


