News October 30, 2024
మీర్జంపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్: కలెక్టర్
కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచారం ఇవ్వకుండా డ్యూటీ హాజరుకానుందన శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు. ఉన్నతాధికారులు అందించిన సూచనలు, ఆదేశాలను పట్టించుకోకుండా.. డ్యూటీలో చేరమని అక్టోబర్ 26న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ చేరకపోవడంతో సస్పెండ్ చేశామన్నారు.
Similar News
News October 31, 2024
చొప్పదండి ఎమ్మెల్యేకు బెదిరింపులు.. లుక్ అవుట్ జారీ
KNR జిల్లా చొప్పదండి MLA మేడిపల్లి సత్యంను ఫోన్, వాట్సాప్‌లో బెదిరించిన వ్యక్తిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్‌అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. MLA సత్యంకు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా నిందితుడు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో తనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, కేసు నమోదైంది.
News October 31, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వేములవాడ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్.
@ రామడుగు మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ మానకొండూరు మండలంలో కారు, అంబులెన్స్ ఢీ.. ఒకరికి గాయాలు.
@ మల్యాల మండలంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి.
@ గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్.
News October 31, 2024
వేములవాడలో మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం
మాస శివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వరి స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు నిర్వహించారు. స్వామివారికి మహాలింగార్చన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.