News November 10, 2025
మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.
Similar News
News November 10, 2025
బిక్కనూర్: గురుకుల కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

బిక్కనూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివి, 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిషన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
News November 10, 2025
INTERESTING: అరటిపండు తినలేనోడు.. విమానాన్ని తినేశాడు

ప్లేట్లు, పలు వస్తువులు తినే వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి మిచెల్ లోటిటో. ఫ్రాన్స్‌లో 1950లో పుట్టారు. 9 ఏళ్ల వయసు నుంచే గాజు, ఇనుప పదార్థాలను తినడం మొదలుపెట్టారు. పికా అనే ప్రత్యేక వ్యవస్థతో లోటిటో బాడీ నిర్మితమైందని వైద్యులు తెలిపారు. ఆయన ఓ విమానాన్ని రెండేళ్లలో పూర్తిగా తినేశారు. సైకిల్స్, టీవీలు తినే లోటిటో 2006లో మరణించారు. అయితే ఆయన అరటిపండు తినలేకపోయేవారు.
News November 10, 2025
కామారెడ్డి: బీసీ ప్రజలని ఏకం చేస్తాం: విశారదన్ మహారాజ్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు BCలని చిన్న చూపు చూస్తున్నాయని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాలోని R&B గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన BC సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న BC ప్రజలను ఏకతాటి పైకి తేవడానికి అన్ని జిల్లాలో సదస్సులు నిర్వహిస్తామన్నారు.


