News November 4, 2025

మీర్జాగూడ ఘటన.. TGSRTC తీవ్ర దిగ్ర్భాంతి

image

మీర్జాగూడ ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 19 మంది మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. బస్సుకు ఫిట్‌నెస్ ఉందని, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు TG ప్రభుత్వం రూ.5 లక్షలు, RTC రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపింది.

Similar News

News November 4, 2025

SU B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో B.A, B.com, Bsc పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 1వ, 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ పరీక్షలు NOV 13 తేదీ నుంచి DEC 4వ తేదీ వరకు జరగనున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

News November 4, 2025

పుంగనూరులో విషాదం

image

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.

News November 4, 2025

దుర్గగుడి చైర్మన్ ఫ్రస్ట్రేషన్..!

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దుర్గగుడి ఉద్యోగులపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తనకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని, గౌరవం ఇవ్వట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు లేఖ కూడా రాసినట్లు ఆయన చెబుతున్నారట. దీంతో దుర్గ గుడిలో చైర్మన్ Vs ఉద్యోగుల మధ్య వార్ నడుస్తోందనే చర్చ జోరుగా జరుగుతోంది.