News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

image

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News November 3, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ రెడ్డి ‘7 రోజుల ప్రచార వ్యూహం’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం BRSను లక్ష్యంగా చేసుకుని ‘7 రోజుల ప్రచార వ్యూహం’ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. ఈవ్యూహంలో KCR అవినీతి పాలన చేశారనే విషయాన్ని రేవంత్ రెడ్డి హైలైట్ చేయనున్నారు. BRSనేతల ఇంటింటి ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై ప్రచారం చేయాలని మంత్రులను కోరారు. GHMC మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షించనున్నారు.

News November 3, 2025

BREAKING: HYD: బాలానగర్‌లో MURDER

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో గఫర్(39) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే: కిషన్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ, క్యాంపెయిన్ నిర్వహించారు. నాగార్జున కమ్యూనిటీ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు పక్కా అని, BRS, కాంగ్రెస్ పాలనల్లో వెనుకబాటును సరిదిద్దేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపఎన్నికలో దీపక్ రెడ్డి విజయం కీలకమని పేర్కొన్నారు.