News March 10, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 457 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

Similar News

News February 28, 2026

మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 4న హోలీ పండుగ

image

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.

News February 28, 2026

అక్రమ గల్ఫ్ ఏజెంట్లపై కడప ఎస్పీ కొరడా

image

మహిళలను టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ పంపి మోసగిస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు కేవలం రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి అన్నారు. గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్నవారు ‘Madad’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దళారుల సమాచారం తెలిస్తే 9121100504, 9121100652 నంబర్లకు తెలపాలన్నారు.

News February 28, 2026

AI ఫియర్.. ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు!

image

ఏఐ విప్లవం ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నా కొన్ని వృత్తులు మాత్రం అత్యంత సురక్షితమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి శారీరక నైపుణ్యం ఉన్నవారిని ఏఐ భర్తీ చేయలేదు. అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, చెఫ్, వ్యవసాయం వంటి వృత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చేతులతో చేసే పని, మనుషులతో జరిపే సంభాషణ ఉన్నంత కాలం ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు.