News March 10, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సత్యసాయి జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 427 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News March 10, 2025
అల్లూరి జిల్లాలో 115 మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో ఇంటర్ సెకండియర్ వ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ జనరల్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాల్లో 4,315 మంది హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది పరీక్షకు హాజరయ్యారు. 115 మంది పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి అప్పలరాం తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1217మందికి 1136మంది రాశారని వెల్లడించారు. జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.
News March 10, 2025
రాష్ట్రంలో భారీ స్కామ్: కేటీఆర్

TG: రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు CM రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని KTR ఆరోపించారు. రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు HYDలో విచ్చలవిడిగా టీడీఆర్‌లు కొంటున్నారని పేర్కొన్నారు. ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని ప్రశ్నించారు.
News March 10, 2025
సోంపేట: 5 రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి

సోంపేట మండలం కొర్లాం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీగా పనిచేసిన తామాడ గణపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన భార్య తామాడ భారతి కూడా సరిగా 5 రోజుల ముందు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పనిచేశారు.