News October 20, 2025
మీ చిన్ననాటి దీపావళి గుర్తుందా?

దీపావళి అనుభూతుల పండుగ. ఉదయం తొందరగా లేచి కొత్త బట్టలు, తీపి వాసనలతో నిండిన ఇంటి వాతావరణం, స్నేహితులతో టపాకులు పేలుస్తూ సందడి. అయితే ఇప్పుడు ఫోన్లు, షార్ట్ వీడియోలు దీపావళిని ఆక్రమించాయి. టెక్నాలజీ యుగంలో బాణాసంచాల కన్నా బిజీ లైఫ్, సెల్ఫీ ఫిల్టర్లే ఎక్కువ. మరి మీ నాటి దీపావళి జ్ఞాపకాలు గుర్తున్నాయా? టపాకాయాల కోసం ఇంట్లో మారాం చేశారా? కామెంట్ చేయండి..
Similar News
News October 20, 2025
తిరువూరు గొడవలకు ఆ ఇద్దరి నేతల ఆధిపత్యమే కారణమా?

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పదవుల కేటాయింపు, ఆర్థిక వనరుల విషయంలో ఇద్దరు తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం ముదురుతోందని టాక్. కొలికపూడి నేనే బాస్ అని భావిస్తుండగా, ఎంపీ చిన్ని తన వర్గానికి వాటా కావాలని పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం జోక్యం చేసుకున్నా ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో వివాదాలు కొనసాగుతున్నాయంట.
News October 20, 2025
ఖైరతాబాద్‌లో రేపు సాయంత్రం సదరోత్సాహం

ఖైరతాబాద్‌లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
News October 20, 2025
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్‌వెస్లీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.