News June 26, 2024

మీ సేవల నిర్వాహకులకు న్యాయం చేస్తాం: పల్లా

image

గత ప్రభుత్వం మీ సేవలను నిర్వీర్యం చేసిందని మీసేవా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మీ సేవ నిర్వాహకులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు.

Similar News

News January 16, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేళ ఓఅపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News January 15, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేల ఒక అపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News January 14, 2025

మధురవాడ: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధురవాడ జాతీయ రహదారిపై ఆనందపురం వెళుతున్న ఓ బైక్‌పై లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు ఢీకొనడంతో వెనుక కూర్చున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ సునీల్ దర్యాప్తు చేపట్టారు.