News December 22, 2025
ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణరక్షణ: ఎస్పీ సంకీర్త్

మొరంచపల్లి వాగులో వరద ముప్పును ఎదుర్కొనేందుకు నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎస్పీ సంకీర్త్ పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం వంటి అంశాలను ఆయన నిశితంగా గమనించారు. సహాయక చర్యల్లో సమాచార వ్యవస్థ కీలకమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Similar News
News December 24, 2025
ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్‌లో కీలక సమాచారం?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్ కీలకం అవుతోంది.
News December 24, 2025
ఐటీ విభాగంలో మెదక్ పోలీస్ సిబ్బంది ప్రతిభ

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది CCTNS/ ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర అదనపు డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, ఆర్.అమరనాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.
News December 24, 2025
చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలనం నమోదైంది. వన్డే హిస్టరీలోనే తొలిసారి బిహార్ జట్టు 500 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే ఆ మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 50 ఓవర్లలో 574/6 స్కోర్ చేసింది. వైభవ్ 190(84), ఆయుష్ 116(56), సకిబుల్ గని 128*(40B), పీయూష్ సింగ్ 77 ఆకాశమే హద్దుగా చెలరేగారు. గని 32 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్టు A క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.


