News March 20, 2025
ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ పని: సీపీ

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కర్తవ్యమని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం స్పెషల్ బ్రాంచ్ విభాగం చెందిన అధికారులు, సిబ్బందితో పోలీస్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న వీధుల తీరును అడిగి తెలుసుకున్నారు. ముందస్తు ఖచ్చితమైన సమాచారాన్ని అందజేయాలన్నారు.
Similar News
News March 21, 2025
వరంగల్: భద్రకాళి చెరువు పనులను పరిశీలించిన మంత్రి

భద్రకాళి చెరువు పూడికతీత పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, కెఆర్ నాగరాజు, గుండు సుధారాణి కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావిణ్య, కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు.
News March 21, 2025
నల్లబెల్లి: తల్లిదండ్రుల కల నెరవేర్చిన కుమారుడు

తల్లిదండ్రుల కలను ఓ కుమారుడు నెరవేర్చాడు. నల్లబెల్లి మండల పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలి, పద్మ దంపతుల కుమారుడు బొట్ల కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2023 టీఎస్పీఎస్పీ సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో భద్రాద్రి జోన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వరంగల్ జిల్లా టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు.
News March 20, 2025
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.