News October 3, 2024

ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు హైకోర్టులో విచారణ

image

ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు

Similar News

News October 3, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్న 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళతారు. అనంతరం అక్కడ జీఎస్‌డీపీ వృద్ధిపై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఐ అండ్ పీఆర్ శాఖపై, ఆ తర్వాత నెలవారీ గ్రీవెన్స్‌ల పరిష్కారంపై రివ్యూ చేస్తారని చెప్పారు.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

News October 3, 2024

విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు (సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.