News December 27, 2025
ముక్కలు కాబోతున్న అన్నమయ్య జిల్లా?

అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో, రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతిలో కలుపుతున్నట్లు సమాచారం. అయితే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 28, 2025
ఢిల్లీకి ‘డోమ్’.. శత్రువులకు చుక్కలే

ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం ‘క్యాపిటల్ డోమ్’ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు QRSAM, VL-SRSAM దీంట్లో కీలక పాత్ర పోషిస్తాయి. వినూత్న లేజర్ ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఇవి డ్రోన్లను క్షణాల్లో కూల్చేస్తాయి. ఈ వ్యవస్థతో ఢిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక రక్షణ వలయం ఏర్పడబోతోంది.
News December 28, 2025
ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.
News December 28, 2025
శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం

భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ అధ్యయనోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన సోమవారం రామయ్య శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం గోదావరి నదిలో స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించే ‘తెప్పోత్సవం’ కోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. హంస వాహనంపై రామయ్య విహరించే దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.


