News December 25, 2025
ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్తున్నారా?

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో తీసుకురానున్నారు. 100, 300, 500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంచుతారు. దర్శనానికి టికెట్లు ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చ. ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్లే ఈ విషయాన్ని భక్తులు గమనించాలి.
Similar News
News December 25, 2025
ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.
News December 25, 2025
స్వయంకృషి: MILK.. మిడిల్ క్లాస్ సిల్క్!

ప్రతి ఇంటికీ పొద్దున్నే కావాల్సిన పాలు ఇప్పుడు కల్తీ లేదా ప్యాకెట్ మయంగా మారాయి. ప్రజలు వీటితో నష్టం గ్రహించి తిరిగి లోకల్ సెల్లర్స్, మిల్క్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రైతులకు టైమ్‌కు, తగిన ధర చెల్లిస్తే నాణ్యమైన పాలు పొందడం కష్టమేం కాదు. నమ్మకం, నాణ్యత మెయింటైన్ చేస్తే రోజూ పట్టణాలు, నగరాల్లో ₹వేల ఆదాయం. మిగిలితే అనే భయం లేకుండా పెరుగు, నెయ్యి లాంటి ఆప్షన్స్ ఉంటాయి.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా
News December 25, 2025
హిందూత్వం ఓ మహోన్నత మార్గం

హిందూ అనేది కేవలం మతం కాదు. ఇదో ‘జీవన విధానం’. మతం అనేది నిర్దిష్ట ప్రవక్త, గ్రంథానికి కట్టుబడి ఉంటుంది. కానీ హిందూ ధర్మంలో అనేక మార్గాలు, గ్రంథాలు, దైవ రూపాలు ఉన్నాయి. ఇది మనిషి తన బాధ్యతలను (ధర్మాన్ని) ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. సత్యం, అహింస, ప్రాణి కోటి పట్ల దయ చూపడం వంటి విశ్వవ్యాప్త సూత్రాలే దీని పునాది. అందుకే హిందుత్వాన్ని క్రమశిక్షణతో కూడిన ‘ధర్మం’ అని కొలుస్తుంటారు.


