News December 24, 2024
ముక్తాపూర్‌తో శ్యామ్ బెనగల్‌కు అనుబంధం!

అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పద్మశ్రీ శ్యామ్ బెనగల్(90)కు యాదాద్రి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985లో పారిశ్రామికీకరణతో చేనేత, చేతివృత్తులు ఎలా మసకబారిపోతున్నాయో తెలిపేందుకు ఆయన హిందీలో ‘సుస్మన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో 40 రోజులపాటు చిత్రీకరించారు. ఆ సినిమాలో ప్రముఖ నటుడు ఓంపురి, నటి షబానా అజ్మీ నటించారు.
Similar News
News February 17, 2026
హాలియాలో ఘోర ప్రమాదం: దంపతుల మృతి

నల్గొండ హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొనడంతో పెద్దవూర మండలం కొత్తగూడెంకు చెందిన భార్యాభర్తలు వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. హాలియా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 17, 2026
మానవత్వం చాటుకున్న కోమటిరెడ్డి

నల్గొండ నుంచి HYD వెళుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. క్షతగాత్రులను పరామర్శించి, తన వాహన శ్రేణిలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రిపై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి.
News February 16, 2026
చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటల ఆక్రమణలపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రంలో ఆక్రమణలను గుర్తించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జలవనరులు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో కబ్జాలకు తావులేకుండా నిఘా పెంచాలని స్పష్టం చేశారు.


