News March 30, 2025

ముక్తేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి మహేశ్ తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Similar News

News January 11, 2026

నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

పట్టణంలోని రాంనగర్‌లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.

News January 11, 2026

సెంచరీ భాగస్వామ్యం.. ఫస్ట్ వికెట్ డౌన్

image

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎట్టకేలకు భారత బౌలర్ హర్షిత్ రాణా తొలి వికెట్ తీశారు. 62 పరుగులు చేసిన నికోల్స్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఓపెనర్లిద్దరూ అర్ధసెంచరీలతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. NZ స్కోరు 23 ఓవర్లలో 122/1. క్రీజులో కాన్వే(54), యంగ్(3) ఉన్నారు.

News January 11, 2026

మన ఊరు.. ఫస్ట్ విజువల్ ఏంటి..?

image

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఊరిని వీడిన వారంతా పండగకు తిరిగి వచ్చేస్తున్నారుగా! సొంతూరు ఆలోచన రాగానే గుడి, చదివిన బడి, ఆడుకున్న చెట్టు, వీధి చివర షాపు, మన పొలం, ఊరి చెరువు.. ఇలా ఓ స్పెషల్ విజువల్ మన మైండ్‌లోకి వస్తుంది. ఎప్పుడు ఊరికొచ్చినా ఆ ప్లేస్‌కు వెళ్లడమో, దాని అప్డేట్ తెలుసుకోవడమో పక్కా. మన ఊర్లో మీకున్న ఆ ప్లేస్ ఏంటి? ఈ ఆర్టికల్‌ను మన ఊరి గ్రూప్స్‌లో షేర్ చేయండి, కామెంట్ చేయండి.