News July 29, 2024
ముఖేష్ గౌడ్ వర్ధంతి వేడుకలకు హాజరైన కేటీఆర్

మాజీమంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతిని సోమవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLAలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్‌లు పాల్గొని ముఖేష్ గౌడ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు.
Similar News
News August 7, 2025
భారీ వర్షం.. అమీర్‌పేట మెట్రోలో రద్దీ

HYDలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్‌కాలనీలో 11.1 సెంటీ మీటర్లు, ఖైరతాబాద్‌లో 10 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక భారీ వర్షంలో సొంత వాహనాల్లో ప్రయాణం డేంజర్ అనుకున్నారేమో నగరవాసులు మెట్రోకు క్యూ కట్టారు. రాత్రి 8 గంటల సమయంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో వందలాది మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు పోటీ పడ్డారు.
News August 7, 2025
HYD: టెన్షన్ ఎందుకు దండగా.. స్పెషల్ ట్రైన్ ఉండగా!

నగరం నుంచి కాకినాడ వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. చర్లపల్లి నుంచి కాకినాడకు 8న (శుక్రవారం) (07031), 10న(ఆదివారం) కాకినాడ నుంచి చర్లపల్లికి (07032) ఈ రైలు బయలుదేరుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 7.30గంటలకు, కాకినాడ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుందని CPRO శ్రీధర్ శుభవార్త తెలిపారు. రాఖీ పండుగ కోసం వెళ్లే ప్రయాణికులు స్పెషల్ సర్వీసును సద్వినియోగం చేసుకోండి.
News August 7, 2025
HYDలో సొంత వాహనాలే ముద్దు!

మహానగర ప్రజలు సొంత వాహనం లేనిదే బయటకు అడుగు వేయడం లేదని తేలింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో ట్రైన్, ఎంఎంటీఎస్ ఉపయోగించే వారి సంఖ్య తగ్గిపోయిందని హెచ్ఎండీఏ చేయించిన సర్వేలో తేలింది. 2011లో బస్సులు ఉపయోగించే వారు 42% మంది ఉండగా ఇపుడు 35 % మంది మాత్రమే ఎక్కుతున్నారు. మెట్రోలో వెళ్లేవారి సంఖ్య 3% ఉందని తేలింది. కార్లను ఉపయోగించే వారు 4 % నుంచి 16 %, బైక్స్ వాడేవారు 38% నుంచి 48 శాతానికి పెరగడం విశేషం.