News October 30, 2024
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
సీఎం చంద్రబాబు 11.50 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. దీపం-2 పథకంలో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ప్రారంభించడానికి అవసరమైన రూ.876 కోట్ల చెక్‌ను గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేయనున్నట్లు తెలిపారు. 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయం తెలిపింది.
Similar News
News October 30, 2024
గుంటూరు : LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
News October 30, 2024
గుంటూరు: శాస్త్రవేత్త రామారావు కన్నుమూత
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు(90) మంగళవారం తెనాలిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లాంగ్ ఫామ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేయడంతో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా కూడా వ్యవహరించారు. వేమూరు మండలం జంపనిలో 1935, జూన్ 4వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో రామారావు జన్మించారు. నవంబర్ 1న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 30, 2024
బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగింపు
గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం పోలీసులు అనిల్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.