News July 6, 2025
ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయండి: కలెక్టర్

ఈనెల 10వ తేదీ కొత్తచెరువులో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్ చేతన్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలిసి కొత్తచెరువులో మాట్లాడుతూ.. మెగా PTM 2.0 కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉందన్నారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.
Similar News
News July 6, 2025
కాశ్మీర్ విషయంలో ముఖర్జి దృఢమైన వైఖరి: బండి సంజయ్

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన పడిన తపనను, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన దృఢమైన వైఖరిని బండి సంజయ్ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.
News July 6, 2025
భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
News July 6, 2025
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే..

కొందరు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగేందుకు ఇష్టపడతారు. అలా చేస్తే తొందరగా జీర్ణం అవుతుందని అపోహపడతారు. అయితే ఆ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్బొనేషన్ జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపారు. అధిక మొత్తంలో ఉండే చక్కెరతో బరువు పెరుగుతారని చెప్పారు. కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.