News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
Similar News
News February 25, 2025
నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News February 25, 2025
పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.
News February 25, 2025
కొడంగల్: రైతుల భాగస్వామ్యం అభినందనీయం: కలెక్టర్

కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సమ్మతించిన దుద్యాల మండలం లగచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 102లోని 22మంది రైతులకు రూ.6.38 కోట్ల చెక్కులను ఆయన ఆదివారం అందజేశారు. సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్, లైబ్రరీ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ఉన్నారు.