News December 12, 2025
ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఏర్పాట్లు పూర్తి

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 155 గ్రామపంచాయతీలు, 1392 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
Similar News
News April 12, 2026
చర్చలు విఫలం.. ఏం జరగబోతోంది?

అమెరికా-ఇరాన్ చర్చలు <<19629050>>విఫలం<<>> కావడంతో 14 రోజుల సీజ్‌ఫైర్ ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఆ దేశంలోని న్యూక్లియర్, విద్యుత్, ఆయిల్ ప్లాంట్లను ధ్వంసం చేయవచ్చు. అటు ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, రిఫైనరీ ప్లాంట్లను టార్గెట్ చేసుకొని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయవచ్చు.
News April 12, 2026
MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
News April 12, 2026
MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


