News February 23, 2025
ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
Similar News
News February 27, 2026
ఏపీకి మరో కంపెనీ.. వివరాలివే

AP: జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ కంపెనీ రాష్ట్రానికి రానుంది. తిరుపతిలోని శ్రీసిటీలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనుంది. తొలి దశలో $77 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ పూర్తయ్యాక ఏడాదికి 30వేల టన్నులు ఉత్పత్తి చేయనుంది. జపాన్, యూఎస్ తర్వాత అమోర్ఫస్ మెటల్ కోసం ఏర్పాటయ్యే మూడో ప్లాంట్ ఇదే కావడం విశేషం.
News February 27, 2026
వనపర్తి: అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
News February 27, 2026
NZB: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైందని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, మార్చి13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. నేటి నుంచి మార్చి 4 వరకు https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.


