News December 9, 2025
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

మొదటి విడతలోని 8 మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 159 పంచాయతీలు, 1436 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 1510 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 5 గంటలకు తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Similar News
News December 11, 2025
గద్వాల్ జిల్లా సర్పంచ్ ఎన్నికలు.. తాజా ఫలితాలు

గద్వాల్ జిల్లాలో ధరూర్ మండలం కోతులగిద్ద గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కుర్వ గోవిందమ్మ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 267 ఓట్ల మెజార్టీ సాధించడంతో గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. అదే మండలం నాగర్‌దొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారెడ్డి 33 ఓట్ల తేడాతో గెలుపొందారు. గట్టు మండలం గంగిమాన్ దొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలో థ్రిల్లింగ్ పోరు సాగింది.
News December 11, 2025
మొగల్తూరు: వృద్ధురాలిపై అత్యాచారయత్నం

మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామానికి వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నం జరిగింది. గురువారం మధ్యాహ్నం గ్రామంలో ఆమె కొబ్బరి తోటలో ఈనులు చీరుకుంటున్న సమయంలో పెద్దిరాజు(30) ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 11, 2025
రోడ్లు, వంతెనలు అభివృద్ధిపై పార్లమెంట్‌లో ఎంపీ వినతి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి డెల్టా ప్రాంతంలో కీలక రహదారులు, వంతెనలు అభివృద్ధి చేయాలని లోకసభలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కోరారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అనేక గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని, తీర ప్రాంతాలు కూడా ఉన్నాయని వీటిలో మత్స్యకారులు అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు చిన్న చిన్న రహదారులు, ఇరుకైన వంతెనలే ఆధారమని తెలిపారు


