News January 16, 2025

ముగిసిన పందేలు.. చేతులు మారిన వందల కోట్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్ల పందేలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగిన పందేలు సుమారు రూ.500 కోట్లు పందేలు కాసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బుధవారం సాయంత్రంతో పందెం రాయుళ్లకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. పటమట కొత్తపేట అంపాపురం బరులను అధికారులు మూసివేశారు.

Similar News

News November 3, 2025

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్య పరీక్షల కోసం ART సెంటర్లకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉన్న లేబరేటరీలు, చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇతర సౌకర్యాలపై అరా తీశారు.

News November 3, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదు అభ్యర్థనలు సమర్పించవచ్చని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 2, 2025

కృష్ణా: 22వ జాతీయస్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు పయనం

image

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 22వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు ఆంధ్రప్రదేశ్ జట్లు పయనమైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారం దిలీప్ కుమార్ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ పురుషులు, మహిళల జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు సంఘ సభ్యులు శ్రీనుబాబు, నీరజ శుభాకాంక్షలు తెలిపారు.