News April 3, 2025
ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.
Similar News
News April 4, 2025
భద్రాచలం వెళ్తుండగా.. కాలు నుజ్జునుజ్జయింది..!

అశ్వారావుపేట మండలం అసుపాక సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చాగల్లు ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. అలసటగా ఉండి భద్రాచలం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంజు అనే యువతికి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. పలువురికి గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News April 4, 2025
‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

IPL: కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.
News April 4, 2025
రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్‌లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.