News April 3, 2025
ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.PLEASE SHARE IT.
Similar News
News April 4, 2025
బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 4, 2025
IPL: రూ.23.75 కోట్లు పెట్టింది ఇందుకే..

మెగా వేలంలో రూ.23.75 కోట్లకు అమ్ముడైన వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్లోని తొలి మూడు మ్యాచుల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. నిన్న SRHపై తిరిగి ఫామ్ అందుకున్నారు. 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 60 రన్స్ చేశారు. ఆరంభంలో స్లోగా ఆడిన అతడు.. చివరి ఓవర్లలో రింకూతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. SRHపై వెంకీకి మంచి రికార్డు ఉంది. ఆరెంజ్ ఆర్మీపై 9 మ్యాచుల్లో 152 స్ట్రైక్ రేటుతో 208 రన్స్ చేశారు.
News April 4, 2025
కర్నూలు: ‘విమానాశ్రయానికి వసతులు కల్పించాలి’

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.