News December 12, 2025

ముగిసిన ప్రచారం.. ఇక ప్రలోభాల పర్వం !

image

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం 5 గంటలకు ముగిసింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ప్రచారాలతో సందడి చేసిన గ్రామాలు ఒక్కసారిగా విలవిలపోయాయి. ప్రచార నిషేధం అమల్లోకి రావడంతో ఇక ప్రలోభాల ఎర ప్రారంభమైంది. ఓటర్లకు మద్యం డబ్బులు పంపిణీ చేసేందుకు పోటీ చేస్తున్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Similar News

News December 14, 2025

మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

నిర్మల్ జిల్లాలో 23.99% పోలింగ్

image

నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 23.99 శాతం పోలింగ్ నమోదయింది. నిర్మల్ గ్రామీణ 22.22 శాతం, సారంగాపూర్ 21.59 శాతం, సోన్ 23.03 శాతం, దిలావర్పూర్ 23.84 శాతం, కుంటాల 22.16 శాతం, నర్సాపూర్ (జి) 27.70 శాతం, లోకేశ్వరం మండలంలో అత్యధికంగా 28.06 శాతం పోలింగ్ నమోదయింది.

News December 14, 2025

పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఓటు వేశారంటే@9AM?

image

పెద్దపల్లి జిల్లాలో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,12,658 మంది ఓటర్లలో 26,965 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 23.94%గా నమోదైంది. అంతర్గాం మండలంలో 24.98 శాతం, ధర్మారం 26.66 శాతం, జూలపల్లి 23.90 శాతం, పాలకుర్తి 19.18 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.