News April 19, 2025

ముగ్గురు సత్యసాయి జిల్లా వాసులు మృతి.. Update

image

కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు శ్రీ సత్యసాయి జిల్లా వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరు కర్నాటకలోని రాయచూరు జిల్లాలో గొర్రెల రేటు తక్కువ ఉంటుందని కొనేందుకు బొలేరోలో పయనమయ్యారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో పరిగి మండలం ధనాపురానికి చెందిన నాగభూషణం(42) శీగుపల్లికి చెందిన మురళి(44) కోటిపికి చెందిన నాగరాజు(40) అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News April 20, 2025

చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 20, 2025

వై.రామవరం: ఆ చెట్టుకు ఆకులు కంటే కాయలే ఎక్కువ

image

ప్రకృతి అందాలతో కళకళలాడే అల్లూరి జిల్లా పలు వింతలకు నిలయం. వై.రామవరం మండలం గుమ్మరిపాలెం సమీపంలో అడవికి దగ్గరగా ఉన్న ఈ మామిడి చెట్టు అప్రాంతాన్ని వెళ్లే వారిని ఆకట్టుకుంటుంది. ఆకులు కంటే కాయలే ఎక్కువగా కనిపించడంతో ఆ చెట్టును చూడకుండా ఉండలేరు. గుత్తులు గుత్తులుగా వందలాది కాయలతో దర్శనం ఇస్తోంది. పండు చిన్నది అయినా చాలా తీయగా, రుచిగా ఉంటుందని స్థానికులు తెలిపారు.

News April 20, 2025

పెద్దపల్లి: హిందువులంతా ఏకమై ఉద్యమిస్తాం: విశ్వహిందూ పరిషత్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.

error: Content is protected !!