News April 1, 2025

ముగ్గుల పోటీల్లో రూ.2 లక్షల ప్రైజ్ మనీ సాధించిన యాజలి మహిళ

image

అమెరికా అసోసియేషన్ ఆధ్వర్యంలో USAలో ఆన్లైన్ విధానంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యాజలి గ్రామానికి చెందిన లుక్కా భార్గవి 5వ బహుమతి గెలుచుకొని రూ.2 లక్షలు ప్రైజ్ మనీ గెలుపొందారు. ఈ సందర్భంగా భార్గవిని యాజలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామర్ల సూర్యనారాయణ, వీర రాఘవయ్య తదితరులు అభినందించారు. ఈ ముగ్గుల పోటీలలో 30 వేల మంది పాల్గొన్నారు.

Similar News

News February 14, 2026

పాలమూరు పురపోరు.. కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన MBNR కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, 18 మున్సిపాలిటీలలో 316 వార్డులు ఉండగా..
కాంగ్రెస్‌ 30 డివిజన్లు, 179 వార్డులు,
BRS 15 డివిజన్లు, 75 వార్డులు,
BJP 7 డివిజన్లు, 38 వార్డులు,
AIFB 9(W),
MIM 6(W),
ఇండిపెండెంట్‌లు 9(W),
CPM రెండు స్థానాలు గెలుపొందాయి.
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది.

News February 14, 2026

ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

image

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

News February 14, 2026

మధిరలో హ్యాట్రిక్ కౌన్సిలర్‌గా.. BRS తరఫున ఏకైక

image

మధిర మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత ఓటమి లేకుండా మూడోసారి హ్యాట్రిక్ కౌన్సిలర్‌గా యన్నంశెట్టి వెంకట అప్పారావు విజయం సాధించారు. తొలిసారి సీపీఎం, రెండోసారి బీఆర్‌ఎస్ నుంచి 8వ వార్డు నుంచి గెలిచిన ఆయన, ఈసారి 19వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మునుగోటి వెంకటేశ్వర్లుపై 192 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మధిరలో బీఆర్‌ఎస్ తరఫున ఏకైక కౌన్సిలర్‌గా నిలవడం విశేషం.