News December 21, 2024
ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Similar News
News September 14, 2025
కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.
News September 14, 2025
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.
News September 13, 2025
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.