News October 28, 2025
ముత్తారం: ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ తనిఖీలు

ముత్తారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ డీ.కల్పన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిసరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల హాజరు శాతం, యూనిట్ టెస్ట్ మార్కుల వివరాలపై ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, మార్కులు ఎక్కువ వచ్చేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకుల టీచింగ్ విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 29, 2025
గజ్వేల్: వాచ్‌మెన్ దారుణ హత్య.. ఇద్దరు పరారీ

వాచ్‌మెన్ దారుణ హత్యకు గురైన ఘటన గజ్వేల్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆడెపు బాలయ్య గజ్వేల్‌లోని Vమార్ట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా సమీపంలోని చెట్లల్లో అతడి మృతదేహం లభ్యమైంది. బాలయ్యతోపాటు పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వాచ్‌మెన్‌లు పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
News October 29, 2025
తుఫాను: అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

మొంథా తుఫానుతో ఇవాళ అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటిచింది. వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలోనూ సెలవు ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తుఫాను దృష్ట్యా ప్రభుత్వం జిల్లాకు ₹50లక్షల నిధులు విడుదల చేసింది.
News October 29, 2025
జహీరాబాద్‌లో యువతి అదృశ్యం

యువతి అదృశ్యమైన ఘటన జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. రంజోల్ గ్రామానికి చెందిన నర్సింగ్ యువతి (21) అక్టోబర్ 26 అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సంప్రదించాలని ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ తెలిపారు.


