News September 23, 2025
‘ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ఏర్పాట్లు’

మెట్‌పల్లి మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 26న ఉన్నతాధికారులతో కలిసి ఫ్యాక్టరీని సందర్శిస్తామని, రైతులను కలుస్తామని చెప్పారు. ఈ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ కార్యదర్శి, ఎస్పీ అశోక్ కుమార్, వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Similar News
News September 24, 2025
హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువులను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు కబ్జాలకు గురి కావడంతో వరద నేరుగా చెరువుకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
News September 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 24, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.23 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 24, 2025
ఎర్రచందనం స్మగ్లరుకు 5 ఏళ్ల జైలు, రూ.6 లక్షల జరిమానా

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన అండీకి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6లక్షల జరిమానా విధించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిపి నేరం రుజువుకావడంతో ఈ తీర్పు వెలువడింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికే నేరస్తులకు ఇది హెచ్చరికగా నిలుస్తుందని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ అన్నారు.