News November 19, 2025
ముత్యాలమ్మపాలెం: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళుతుండగా అలల తాకిడికి పడవ బోల్తా పడింది. చింతకాయల పెంటయ్య, అర్జిల్లి బండియ్య గాయాలతోను మిగిలినవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర నాయకుడు చింతకాయల ముత్యాలు మెరైన్ పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 19, 2025
పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.
News November 19, 2025
పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత బాబా గౌరవార్థం స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తారు. <<18326817>>100<<>> ఆవులను రైతులకు పంపిణీ చేస్తారు. హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో పాల్గొని ప్రసంగిస్తారు.
News November 19, 2025
అంకిత భావంతో కృషి చేయాలి: NZB కలెక్టర్

10వ తరగతి ఫలితాలు మరింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి MEOలు, కాంప్లెక్స్ HMలకు సూచించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడుల స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ MEOలు, కాంప్లెక్స్HMలతో చర్చించారు. వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.


