News March 12, 2025
ముదిగుబ్బ మండలంలో 120ఏళ్ల వృద్ధుడి మృతి

ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఉరుముల బుచ్చన్న (120) అనే శతాధిక వృద్ధుడు శివైక్యం చెందారు. 1905లో జన్మించిన ఆయన స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలను కళ్లారా చూశారు. వందేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసుమీద పడటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. గొప్ప కళాకారుడిని కోల్పోయామని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News October 31, 2025
INDvsAUS రెండో టీ20కి వర్షం ముప్పు

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో T20 జరగనుంది. అయితే మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగే టైమ్‌కి 93% వర్షం పడే అవకాశాలున్నాయని AccuWeather పేర్కొంది. వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి. కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి T20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
News October 31, 2025
బీట్‌రూట్‌తో బ్యూటీ

బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్‌రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో మచ్చలు తగ్గుతాయి. * బీట్‌రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చర్మం ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News October 31, 2025
రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి 30 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని కోరారు.


