News March 6, 2025
ముదినేపల్లి: ఎలుకల మందు తిని యువకుడు ఆత్మహత్య

ముదినేపల్లి మండలం వడాలికి చెందిన కటికల నాగరాజు (17) ఎలుకల మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఎలుకల మందు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో సానికులు ఆసుపత్రికి తరలించారు. విఆర్వో పద్మ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతికి ప్రేమ, తల్లి మందలించడమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.
News March 6, 2026
కోనసీమ: టెన్త్ స్టూడెంట్స్.. HI అని మెసేజ్ చేస్తే చాలు..!

విద్యార్థులు వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ వాట్సాప్ ద్వారా ‘మనమిత్ర’ మొబైల్ నెంబర్ 9552300009 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు సులభంగా హాల్ టికెట్లు చేరువచేసేందుకు ప్రభుత్వం మనమిత్ర యాప్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచిందన్నారు.
News March 6, 2026
పెద్దపల్లి: ఐటీఐ అభ్యర్థులకు సువర్ణ అవకాశం!

పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ‘పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి తెలిపారు. ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, కోపా తదితర ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు.


