News April 5, 2025

ముదినేపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి

image

కాకినాడ(D) గండేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డిగ్రీ విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ(21) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం.. ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రిలో చదువుతున్నాడు. ఫ్రెండ్ విష్ణువర్ధన్‌తో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Similar News

News April 5, 2025

సీఎం చంద్రబాబు ముప్పాళ్లలో శంకుస్థాపన చేసిన పనుల వివరాలివే(2/2)

image

నేడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని గురుకులాలు, SC హాస్టళ్లలో స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్(గ్రామీణ్‌) కింద క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌లకై రూ.58.14 కోట్లతో చేపట్టనున్న 1,938 పనులకు, అలాగే 153 ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ.5.18 కోట్లతో PM- AJAY పథకం కింద ఆర్‌వో ప్లాంట్ల ద్వారా తాగునీటి స‌ర‌ఫ‌రా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. 

News April 5, 2025

ఘంటసాల కుమారుడు కన్నుమూత

image

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి(72) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఘంటసాలకు ఇద్దరు భార్యలు కాగా సరళతో ఆయనకు జన్మించిన కొడుకే రవి. ఆయన భార్య పార్వతి భరతనాట్య కళాకారిణి.

News April 5, 2025

రోజా రూ.119 కోట్లు దోచేశారు: రవి నాయుడు

image

AP: మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమని శాప్ ఛైర్మన్ రవినాయుడు చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమె క్రీడాకారులకు చెందిన రూ.119 కోట్లను దోచేశారని ఆరోపించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. చెన్నైలో ఉండే రోజాకు ప్రస్తుతం ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.

error: Content is protected !!