News October 24, 2024

ముదినేపల్లి: సచివాలయ నిర్మాణానికి అరేకరం పొలం విరాళం

image

రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అరేకరం పొలంను విరాళంగా అందించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె తండ్రి వైద్యులు మనోజ్‌తో కలిసి, దానికి సంబంధించిన నగదును అందించారు. అరేకరంకు సంబంధించిన రూ.12.5 లక్షలు, హైకోర్టు నిర్మాణానికి రూ.1 లక్ష విరాళంగా అందించారు. గతంలో అమరావతి అభివృద్ధికి ఆమె ఒక ఎకరం (రూ.25 లక్షలు) అందించారు.

Similar News

News November 6, 2025

మాక్ అసెంబ్లీకి కృష్ణా జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం 7 నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తెలిపారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సభా వ్యవహారాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని DEO వివరించారు.

News November 6, 2025

పంట నష్టం నమోదు పారదర్శంగా జరుగుతుంది: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవికావని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత 7 రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 6, 2025

కృష్ణా: మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులు వీరే.!

image

రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా నుంచి మొత్తం ఏడు నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎస్. వాగ్దేవి (8వ తరగతి), పెడన- పి. చాందిని 10th, ఉయ్యూరు-ఉప్పాల అక్షయ 10th, గుడివాడ-వి.అక్షిత 10th, గన్నవరం-పి.చరిత 10th, పామర్రు-పాముల హిమబిందు 10th, అవనిగడ్డ-హిమాంజలి 9th. ఎంపికయ్యారు.