News June 26, 2024
ముద్దనూరులో విద్యార్థులకు అస్వస్థత

కడప జిల్లా ముద్దనూరులోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న తరువాత విద్యార్థులకు వాంతులు అయ్యాయి. వెంటనే సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి కడప జిల్లా కలెక్టర్ మాట్లాడి సమాచారం తెలుసుకొని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
YVU దూరవిద్య సమాచారం కోసం ప్రత్యేక డొమైన్

YVU దూరవిద్య సంబంధిత సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ వైవీయూ వెబ్సైట్లో ప్రత్యేక డొమైన్‌ను VC ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. అనుబంధ దూరవిద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షల షెడ్యూల్ ఇలా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ పి.పద్మ, ప్రొ.కె.కృష్ణారెడ్డి, ప్రొ.తుమ్మలకుంట శివ, డా.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
News February 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.
News February 12, 2026
కడప: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కడప జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.


