News October 8, 2025
ముద్దనూరు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

కడప జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనడంతో చిలమకూరుకి చెందిన హాజీవలి(32) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ఉన్న మరొక వ్యక్తి గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
Similar News
News October 9, 2025
కడప: యూజీసీ నెట్ అర్హత గల వారికి పీహెచ్డీలో ప్రవేశాలు

యూజీసీ నెట్ అర్హత సాధించిన వారికి యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. యూజీసీ నెట్ ఫెలోషిప్, లెక్చరర్స్షిప్, పీహెచ్డీ క్వాలిఫై అయిన అభ్యర్థులు yvu.edu.inను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 15వ తేదీ లోపు వైవీయులో అందజేయాలన్నారు.
News October 8, 2025
వైవీయు నూతన వీసీగా రాజశేఖర్

కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా బెల్లంకొండ రాజశేఖర్‌ను అధికారులు నియమించారు. కొన్ని నెలలుగా ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా అల్లం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా ఇన్‌ఛార్జే ఉండటంతో నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న బెల్లంకొండ రాజశేఖర్‌ను నియమించారు.
News October 8, 2025
కడప జిల్లా నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్

కడప శివారులోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 23 నుంచి గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు), ఎంబ్రాయిడరీ (31 రోజులు) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు.18–45ఏళ్ల మహిళలు అర్హులని అన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 9985606866 నంబర్‌ను సంప్రదించాలన్నారు.