News September 22, 2024

ముద్దనూరు: సినీ ఫక్కిలో దొంగతనం

image

కడప- తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని బొందలకుంట గ్రామంలో శనివారం సినీ ఫక్కిలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొందకుంట రహదారిలో బైక్‌పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మంగపట్నం పుల్లయ్య, సుబ్బమ్మలను పోలీసులమని చెప్పి ఆపి.. వారి వద్ద ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న ముద్దనూరు సీఐ దస్తగిరి, SI మైనుద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.

News September 28, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు ఇవే

image

<<14220966>>కడప<<>> జిల్లాలో అక్టోబర్ 3 నుంచి జరిగే టెట్ పరీక్షా కేంద్రాల వివరాలు.
☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KORM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT ప్రొద్దుటూరు

News September 28, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. 8 కేంద్రాల ఏర్పాటు

image

అక్టోబర్ 03 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో APTET కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://aptet.apcfss.in నందు పొంద గలరని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.