News January 30, 2025
ముద్దోల్: జాతీయస్థాయి రామన్ అవార్డు పోటీలకు ఎంపిక

తానూర్ మండలంలోని బోసి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్యాముల్వార్ అభిజ్ఞ, చాదల ప్రవీణ్ కుమార్ జాతీయ స్థాయి రామన్ అవార్డు ( ఫైనల్) పోటీలకు ఎంపికైనట్లు గైడ్ టీచర్ సుధాకర్ తెలిపారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే ఫైనల్స్‌లో విద్యార్థులు పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డీఈవో రామారావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News September 19, 2025
బల్లికురవ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఒకరి మృతి

బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. ఎస్సై నాగరాజు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా చునార్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్(30) గ్రానైట్ ముడి రాయిని ఎత్తే సమయంలో క్రేన్ గొలుసు తెగి మీద పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
News September 19, 2025
నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
కుట్రలు చేసే వ్యక్తికి శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్ పదవి ఇస్తారా: వినూత

శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్‌గా కొట్టే సాయి నియామకాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్‌కు మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినూత లేఖ రాశారు. ‘మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై సాయి కుట్రలు చేశాడు. ఆ ఆధారాలను హరిప్రసాద్, నాదెళ్ల మనోహర్‌కు అందజేశా. జనసేనలో చాలామంది కష్టపడ్డారు. వాళ్లకు పదవి ఇవ్వండి. అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తా’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.