News April 18, 2024

ముద్రగడ ఓ పెద్ద దరిద్రం: నటుడు పృథ్వీరాజ్

image

పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ పై ముద్రగడ చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండించారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకం, ఆయనో పెద్ద దరిద్రం అంటూ మండిపడ్డారు.

Similar News

News October 9, 2025

లఘు చిత్రాల పోటీకి ఈనెల 15 వరకు గడువు: కలెక్టర్

image

ఆంధ్ర యువ సంకల్ప్ -25- అంబాసిడర్” డిజిటల్ మారథాన్ కార్యక్రమంలో ”యువ సంకల్ప్” లఘు చిత్రాల పోటీకి గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈనెల 15 వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే సెట్వెల్ కార్యాలయం 7075230609 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ముందుగా www.andhrayuvasankalp.com వెబ్ సైట్‌లో రిజిస్టర్ కావాలన్నారు.

News October 8, 2025

మత్స్య సంపద యోజన పథకానికి దరఖాస్తులు: కలెక్టర్

image

పీఎం మత్స్య సంపద యోజన పథకానికి విరివిగా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో పీఎంఎంఎస్‌వై పథకం అమలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పీఎం మత్స్య సంపద యోజన పథకం ద్వారా వివిధ సబ్సిడీ రుణాలను పొంది లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 50% బ్యాంకు రుణం, 40% సబ్సిడీ, 10% లబ్ధిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News October 8, 2025

ఆక్వా చెరువుల సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: కలెక్టర్

image

ఆక్వా చెరువులు సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, వెంటనే అప్సడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆక్వా చెరువులను అప్సడ కింద నమోదు చేసుకోవడం జరిగిందని, ఇంకా 83 వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. అప్సడలో రిజిస్టర్ అయిన వారు మాత్రమే పవర్ సబ్సిడీ, తదితర ప్రభుత్వ రాయితీలను పొందగలరని కలెక్టర్ అన్నారు.